
నరసరావుపేట లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా స్టాంప్ రైటర్ల నిరవధిక పెన్ dwon లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు.పలువురు తమ అభిప్రాయాలను మీడియా వేదికగా తెలిపారు.
జీవో 396 రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ గా నిర్ణయించారు.ఒక పాస్ పోర్టు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అతని చనిపోయిన తర్వాత మరొకరికి బదిలీ కాదనేది ఎంతవాస్తవమో,ఆస్తుల విషయంలో అలాకాదు అనేది ప్రభుత్వం,ప్రజలు గుర్తు పెట్టుకోవాలనేది సత్యమని అభిప్రాయ పడ్డారు.మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు..ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేయటంలో మేం సహకరిస్తాం అని సమావేశం లో తెలిపారు.
396 జీవో వలన సామాన్య ప్రజలకు ఎన్నో ఇబ్బందులు లా అండ్ ఆర్డర్ కావచ్చు, రాజకీయ వత్తిళ్ళు కావాచ్చు ,రాష్ట్రం అల్లకల్లోలం అయ్యే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని సంఘ సభ్యులు తెలిపారు

