- నరసరావుపేట ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి వ్యవహారంలో కీలక పరిణామం
- రేపటి నుండి నరసరావుపేట నుండి గుంటూరు వెళ్లే బస్సులు మేరికపూడి గ్రామంలోకి వెళ్ళొద్దని నిర్ణయం
- నరసరావుపేట నుండి మేరికపూడిలోకి వెళ్లకుండా నేరుగా గుంటూరు వెళ్లాలని ఆదేశాలు
- నరసరావుపేట నుండి గుంటూరు వెళ్లే అన్ని బస్సులు గ్రామంలోకి వెళ్లరాదని నిర్ణయం
- నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో సదరు అంశాన్ని నోటీస్ బోర్డులో పెట్టిన డిపో మేనేజర్
- గతంలో నరసరావుపేట నుండి మేరికపూడి గ్రామంలోకి వెళ్లి అనంతరం గుంటూరుకి వెళ్లనున్న బస్సులు
- సమస్య పరిష్కారం అయ్యే వరకు మేరికపూడిలోకి బస్సులు వెళ్లరాదని తాత్కాలిక ఆదేశాలు జారీ
- నిన్న నరసరావుపేటకి చెందిన కండక్టర్ పూర్ణచంద్రపై దాడి చేసిన మేరికపూడి మహిళలు
- మేరికపూడికి చెందిన ప్రయాణికుడు బస్సు ఎక్కే క్రమంలో కండక్టర్ తో వాగ్వాదం
- మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సుని అడ్డగించి పూర్ణచంద్రపై దాడికి పాల్పడిన మహిళలు
మేరికపూడి గ్రామస్తులకు నరసరావుపేట ఆర్టీసీ అధికారుల షాక్

