2029 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి మహిళలకు 33% సీట్లు ప్రకటించిన మంత్రి Nara Lokesh కు ధన్యవాదాలు తెలుపుతూ నరసరావుపేట పట్టణంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలకు రాజకీయంగా మరింత అవకాశాలు కల్పించే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జాన్ సైదా పాల్గొన్నారు.
నరసరావుపేట పట్టణంలో మహిళల ర్యాలీ




