పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు 1,500 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4 మంది అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 116 మంది ఎస్ఐలు ఉన్నారు. పర్యటన సజావుగా, భద్రంగా జరిగేలా అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


