పల్నాడు జిల్లాలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, *రెవెన్యూ క్లినిక్*

పల్నాడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో *’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’* నిర్వహించనున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ తెలిపారు.

జిల్లా స్థాయి అధికారులు నేరుగా పాల్గొనే ఈ కార్యక్రమానికి అర్జీదారులు తమ పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, గతంలో ఫిర్యాదు చేసి ఉంటే పాత రసీదుతో హాజరుకావాలన్నారు. సమస్యల స్థితిగతులను ఎస్‌ఎమ్‌ఎస్, వాట్సాప్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చని, కలెక్టరేట్‌కు రాలేని వారు *1100 టోల్ ఫ్రీ నంబర్* లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.



మరోవైపు, భూసంబంధిత సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి *’రెవెన్యూ క్లినిక్’* నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఈ క్లినిక్‌కు ఆర్డీవోలు, తహసీల్దార్లు విధిగా హాజరవుతారని, అటు మండల కార్యాలయాల్లోనూ సర్వేయర్లు, వీఆర్వోలు రికార్డులతో అందుబాటులో ఉంటారని పేర్కొంటూ.. జిల్లా ప్రజలు, రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.