భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.రీ సర్వే, పట్టాదారు పాస్బుక్ల పంపిణీ తదితర అంశాలపైన అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ గారు.
జిల్లాలో జరుగుతున్న రీ సర్వే పనులు పారదర్శకంగా, కచ్చితత్వంతో చేపట్టాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న రీ సర్వే పనుల పురోగతిపై ఆయన జిల్లా సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ అధికారి, రెవిన్యూ డివిజినల్ అధికారులు, తహసీల్దార్లు,రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లకు అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లోఎటువంటి అవకతవకలుకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసు, ఫీల్డ్ నందు హాజరు, 9(2) నోటీసు జరుగు సమయములో ఈకేవైసీ, డ్రాఫ్ట్ పట్టాదారు పాస్బుక్ ఇచ్చే సమయములో తప్పనిసరిగా ఈకేవైసీ చేయవలెనని అధికారులను ఆదేశించారు.
