జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌!

జూన్ నెలలో బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఈ నెలలో బ్యాంకులు ఏకంగా 11 రోజులు మూతపడనున్నాయి.
ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు, పలు ప్రాంతీయ పండుగల కారణంగా ఈ సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా, జూన్ 26న మొహర్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. జూన్ 26, 27, 28 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.